Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ వారం విడుదలవుతున్న సినిమాలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో 'ఆదిపురుష్'కు పోటీగా ఒక్క సినిమానే!

Telugu movies releasing this week
Advertisement
  • ఈ నెల 16న విడుదల కానున్న 'ఆదిపురుష్'
  • ప్రభాస్ చిత్రానికి పోటీగా బరిలో లేని సినిమాలు
  • 16న ఓటీటీలోకి వస్తున్న 'కనులు తెరిచినా కనులు మూసినా'
Advertisement
ఈ వారం థియేటర్లు మొత్తం జై శ్రీరాం నినాదాలతో మోతెక్కనున్నాయి. ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతామాతగా నటించిన మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్' ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రను పోషించడం ఈ చిత్రానికి మరో హైలైట్. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. 'జై శ్రీరామ్' పాట యూట్యూబ్ ను ఊపేస్తోంది. ఈ చిత్రం జూన్ 16న విడుదల కాబోతోంది. 

మరోవైపు, 'ఆదిపురుష్' విడుదల కావడానికి ఒక రోజు ముందు హాలీవుడ్ చిత్రం 'ది ఫ్లాష్' విడుదలవుతోంది. ఈ చిత్రంలో మిల్లర్ కీలక పాత్రలో నటించగా, ఆండీ యూషియాటీ దర్శకర్తం వహించారు. ఇండియాలో ఇంగ్లీష్ తో పాటు పలు భాషల్లో విడుదల చేస్తున్నారు. 15వ తేదీన ఇది తెలుగులో కూడా విడుదల కాబోతోంది. ఈ సినిమా చూసేందుకు మన తెలుగు ప్రేక్షకులు ఎలాగూ పెద్దగా ఉత్సుకత చూపించరు. కాబట్టి 16 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల థియేట్లర్లలో పూర్తిగా 'ఆదిపురుష్' సందడే ఉండబోతోంది.   

ఇంకోవైపు, ఈ నెల 15న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'సైతాన్' వెబ్ సిరీస్ (తెలుగు) స్ట్రీమింగ్ కానుంది. జూన్ 16న ఈటీవీ విన్ లో 'కనులు తెరిచా కనులు మూసినా' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Advertisement
Advertisement
Tollywood
Movies
Release
This Week
Adipurush

More Telugu News